అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బంగ్లాను 198 పరుగులకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో తేలిపోయింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో కనీసం ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేదు. కెప్టెన్ మహ్మద్ అమన్ (26) టాప్ స్కోరర్. తొమ్మిదో స్థానంలో వచ్చిన హార్దిక్ రాజ్ (24), సిద్ధార్థ్ (20), కార్తికేయ (21) పరుగులు చేశారు. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. నిఖిల్ కుమార్ (0), హర్వాన్ష్ సింగ్ (6) కూడా నిరాశపర్చారు. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్ 3, హకీమ్ తమీమ్ 3, ఫహద్ 2, మరుఫ్, రిజాన్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హసన్ (47; 65 బంతుల్లో 3 ఫోర్లు), షిహాబ్ (40; 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫరిద్ హసన్ (39; 49 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా 2, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2.. కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు. భారత్ గతేడాది ఈ టోర్నీలో సెమీస్‌లో బంగ్లా చేతిలోనే టీమ్‌ఇండియా ఓడింది.
0 Comments