కళ్ల మీద నువ్వుల నూనెతో రోజు రాత్రి పడుకునే ముందు, మర్దన చేయడం వలన మంచి నిద్రని పొందడమే కాకుండా, కళ్ల కింద ముడతలు కూడా పోతాయి. కళ్ల కింద ముడతలు పోవాలంటే, రోజు రాత్రి పూట కొంచెం నువ్వుల నూనె తీసుకుని, కళ్ల వద్ద ముడతలు ఉన్న ప్రాంతంలో రాసుకున్నట్లయితే, చర్మం మృదువుగా మారుతుంది. అందంగా తయారవుతుంది. ఆముదం, కొబ్బరి నూనె కూడా ముడతలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెని నిద్రపోవడానికి ముందు, కళ్ల కింద రాసుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. దీనివలన కళ్ల కింద ముడతలు బాగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెని మర్ధన చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ఎటువంటి మచ్చలైనా సరే, ఈజీగా తొలగిపోతాయి.
0 Comments