Ad Code

కమలా హారిస్ విజయం కోరుతూ స్వగ్రామంలో ప్రత్యేక పూజలు !


మెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు కమలా హారిస్ గెలుపుకోసం అక్కడి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. హారిస్ తాతగారైన (తల్లికి తండ్రి) పీపీ గోపాలన్ వందేళ్ల క్రితం ఈ గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి ప్రభుత్వాధికారిగా రిటైరయ్యారు. తులసేంద్రపురం గ్రామంలో హ్యారిస్ విజయం కోరుకుంటూ టెంపుల్ సెర్మనీలో స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ గడ్డపై పుట్టిన ఆడకూతురు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆలయం వెలుపల స్థానిక రాజనీయనేత అరుల్‌మొళి సుధాకర్ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న ఒక ఫలకంపై విరాళాలు ఇచ్చిన వారి పేర్లలో కమలా హారిస్, ఆమె తాతగారి పేర్లు కూడా ఉండటం విశేషం. కమలా హారిస్ తమలో ఒకరని, ఆమె గెలుస్తారని, ఆమె గెలుపును ప్రకటించగానే బుధవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేస్తా్మని సుధాకర్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu