తెలంగాణ సచివాలయం బందోబస్తు బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్ నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయ ఆవరణలో పూజలు నిర్వహించి బందోబస్తు బాధ్యతలను చేపట్టారు. గతంలో సచివాలయానికి ఎస్పీఎఫ్ బలగాలే బందోబస్తు నిర్వహించేవి. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ బాధ్యతను స్పెషల్ పోలీసులకు (టీజీఎస్పీ) అప్పగించారు. అయితే ఇటీవల ఏక్ పోలీస్ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే అటు పరువు పోవడంతోపాటు ఇటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, ఇంటివద్ద రక్షణను ఎస్పీఎఫ్‌కు అప్పగించింది. తాజాగా సచివాలయాన్ని సైతం ఎస్పీఎఫ్ పరిధిలోకి తీసుకెళ్లింది.
0 Comments