Ad Code

నల్ల మిరియాలు - ఆరోగ్య ప్రయోజనాలు !


లికాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టడంలో నల్ల మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలతో చేసిన టీ లేదా కషాయం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా నల్ల మిరియాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజనల్‌ వ్యాధులను దరిచేరకుండా అడ్డుకోవడంలో సహాయపడుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మిరియాల కషాయం తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో గొంతు నొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా చలికాలం రకరకాల మిండి వంటలను ఎక్కువగా తింటుంటారు. దీంతో బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. అయితే మిరియాల కషాయం తాగడం వల్ల బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారంలో మిరియాలు చేర్చుకోవడం మంచిది. సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. మిరియాల్లో ఉండే.. యాంటీ-అలెర్జిక్, ఆర్థరైటిక్ గుణాలు నొప్పి, మంటను తగ్గిస్తాయి. కీళ్ల సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu