ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబై నగరానికి సమీపంలోని థానే నగరంలో నివసిస్తున్న ఫాతిమా ఖాన్ (24)ను అరెస్ట్ చేశారు. పది రోజుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుంటే 'బాబా సిద్ధిఖీ' మాదిరిగా చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు ఫాతిమా ఖాన్ ను అరెస్ట్ చేసిన విచారించిన తర్వాత తన ఫోన్ నంబర్ నుంచే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఆమె అంగీకరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమా ఖాన్ మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె థానెలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుందని, ఆమె తండ్రి టింబర్ బిజినెస్ చేస్తారని పోలీసు వర్గాల కథనం. శనివారం సాయంత్రం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంకు యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఇటీవల కొన్ని వారాలుగా ముంబై పోలీసులకు వివిధ వ్యక్తులను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. వీటిలో అత్యధికం సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బాబా సిద్దిఖీ అనే ఎన్సీపీ నేతను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కాల్చి చంపింది.
0 Comments