మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఎన్సీనీ (ఎస్పీ) నేత, సీనియర్ నాయకులు శరద్ పవార్ స్పందించారు. తాము ఆశించిన రీతిలో ఫలితాలు లేవని అన్నారు. "మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలను అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తా. ఇది ప్రజల నిర్ణయం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత విజయం సాధించడానికి కారణం కావచ్చు'' అని అన్నారు. మహారాష్ట్రలో తమ పార్టీ కన్నా అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి అధిక సీట్లు రావడంపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్‌కి తమ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ ఎన్సీపీని ఎవరు స్థాపించారో మహారాష్ట్రలో అందరికి తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇంతలా డబ్బు వినియోగించడాన్ని ఎప్పుడూ చూడలేని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ''బాటేంగేతో కటేంగే'' నినాదం ఎన్నికల్లో ఓట్ పోలరైజేషన్‌ని చేసిందని పరోక్షంగా హిందూ ఓటర్లు సంఘటితం కావడాన్ని శరద్ పవార్ ప్రస్తావించారు. ఈవీఎంలపై సరిగా పనిచేయడం అనే దానిపై ప్రామాణికత లేని చెప్పారు.
0 Comments