Ad Code

తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్ ?


ముంబై ఇండియన్స్ జట్టు 25 కోట్ల రూపాయల విలువైన యంగ్ ఇండియన్ ప్లేయర్ ను కేవలం రూ.8 కోట్లకే దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు వేలం ముందే అసాధారణ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఈ ఏడాది కూడా తన స్మార్ట్ మూవ్ ద్వారా రూ. 25 కోట్ల విలువైన యువ బ్యాట్స్‌మన్‌ను రూ. 8 కోట్లకే తమ జట్టులో ఉంచుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో టీమిండియా యంగ్ ప్లేయర్ 22 ఏళ్ల తిలక్ వర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ ఈ తెలుగు ప్లేయర్ ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఐపీఎల్ 2025 వేలంలో రూ. 25 కోట్ల వరకు ధర పలికే వాడు. 22 ఏళ్ల తిలక్ వర్మ ఇటీవల భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చి దక్షాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుతమైన సెంచరీలు సాధించాడు. తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు. హైదరాబాద్ తరఫున 67 బంతుల్లో 151 పరుగులు చేయడంతో నిపుణులు, అభిమానులు ముంబై గొప్ప స్మార్ట్ మూవ్ చేసిందని అంటున్నారు. తక్కువ ధరకే తిలక్‌ను కొనుగోలు చేయడం ద్వారా ముంబై లాభపడిందని అభిమానులు భావిస్తున్నారు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. తిలక్ వర్మతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ముంబై తమ జట్టులో ఉంచుకుంది.ముంబై ఇండియన్స్ జట్టు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రూ. 18 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను రూ. 16.35 కోట్లకు, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రూ. 16.35 కోట్లకు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu