Ad Code

దేశంలోనే జీడీపీలో టాప్ 1 రంగారెడ్డి జిల్లా !


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అత్యధిక జీడీపీతో దేశంలోనే టాప్ 1లో నిలిచింది. హైదరాబాద్ 18వ స్థానంలో ఉంది. ఏపీ నుంచి ఒక్క జిల్లా కూడా టాప్ 25లో లేకపోవడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి గురుగ్రామ్, గౌతమ్ బుద్ధనగర్, ఫరిదాబాద్, పానిపట్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలున్నాయి. తమిళనాడు నుంచి అత్యధికంగా కోయంబత్తూరు, తిరువల్లూరు, ఈరోడ్, నమక్కల్, చెన్నై ఉన్నాయి. కర్ణాటక నుంచి బెంగళూరు, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్ మంగళూరు ఉన్నాయి. గుజరాత్ నుంచి అహ్మదాబాద్, గాంధీనగర్, భరూచ్, నర్మద జిల్లాలున్నాయి. దేశ జీడీపీ సరాసరిన 225 కోట్లుగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu