Ad Code

భాగమతి రైలు ప్రమాదం సమాచారం ఉంటే చెప్పండి: దక్షిణ రైల్వే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన !


మిళనాడులోని కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈనెల 11న గూడ్స్‌ రైలును మైసూరు- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 16, 17వ తేదీల్లో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై చెన్నైలో రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్నారని రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ప్రజలు తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన వెలువరించింది. రైలు ప్రమాదంపై అధికారులు భిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? సిగ్నలింగ్‌ వైఫల్యమా? కుట్ర కోణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే..వాటితో పాటు చట్టబద్ధమైన విచారణకు హాజరు కావాలని కోరారు. కాగా ఈ కేసు విచారణ పార్క్ టౌన్‌లోని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) కార్యాలయంలో రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో జరగనున్నట్లుగా వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu