హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆ విషయాన్ని హర్యానా ప్రజలు గ్రహించారు అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని అంశాలు స్పష్టంగా తెలిశాయి. 2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉంటాయి. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం. దశాబ్దం అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. కర్ణాటక ( 5 గ్యారెంటీలు), హిమాచల్ ప్రదేశ్ ( 10 గ్యారెంటీలు), తెలంగాణ ( 6 గ్యారెంటీలు) ప్రజలను గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
0 Comments