Ad Code

కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం !


ర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని రోజులుగా తాను హర్యానాలో పర్యటిస్తున్నానని, ప్రజలు మూడోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించబోమని మోడీ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు. 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా ప్రజల్ని సుసంపన్నం చేయడానికి కృషి చేసిందని, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపారు. తండ్రీకొడుకుల రాజకీయాల ('బాపు-బేటే కి రాజనీతి') ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే అని ఆరోపించారు. హిమాచల్, కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదని చెప్పారు.హర్యానాకు కాంగ్రెస్ ఎప్పటికి సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని, ఆ పార్టీ అంతర్గత పోరును ప్రస్తావించారు. రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ రిజర్వేషన్లను అంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ భారతదేశాన్ని బలోపేతం చేయడని మోడీ అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉందని, ప్రపంచం చాలా ఆశలు, అంచనాలతో భారత్ వైపు చూస్తోందని, హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, హర్యానా ఓటర్లు మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు.

Post a Comment

0 Comments

Close Menu