చర్మ సమస్యలు వానా కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చర్మంపై దురద కలుగుతూ ఉంటుంది. దద్దుర్లు వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. చర్మం ఎర్రగా మారడం, మంట కలగడం, వాపు ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది మందులు వేసుకుంటూ ఉంటారు. ఎలర్జీ తగ్గేంత వరకు ప్రతిరోజు కూడా మందులు వేసుకుంటూ ఉంటారు. దాంతో మత్తుగా ఉంటుంది. అంతే కాక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎలర్జీలని తగ్గించడానికి తోటకూర బాగా పని చేస్తుంది. తోటకూరను తీసుకుంటే ఎలర్జీలు తగ్గిపోతాయి. స్కిన్ ఎలర్జీలను తగ్గించేందుకు తోటకూర బాగా సహాయ పడుతుంది. సహజంగా ఎలర్జీలని తోటకూర తగ్గించగలదు. స్కిన్ ఎలర్జీలతో బాధపడే వాళ్ళు వేప నూనె తీసుకుని ఎలర్జీలు, దద్దుర్లు, వాపు ఉన్న చోట అప్లై చేసుకుంటే మంచిది. వేప నూనెలో ఉండే విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలోకి లోతుగా వెళ్లి పోషణ ఇచ్చేలా చేస్తాయి. వేప నూనె చర్మం రక్షిత పొరను కూడా పునరుద్ధరిస్తుంది. తేమ నష్టాన్ని కూడా ఇది తగ్గించగలదు.
0 Comments