బంగారం ధరలు నేడు సరికొత్త రికార్డును సృష్టించాయి. నిన్నటితో పోల్చి చూస్తే మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కొత్త ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,800గా ఉంది. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంత పెరిగినా సరికొత్త రికార్డు అవుతుంది. పసిడి ధరలు అంతర్జాతీయంగా చూసినట్లయితే అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు బంగారం ధర 2700 డాలర్లు పైచిలుకుగా ఉంది. పసిడి ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం యుద్దవాతావరణం కారణంగా కుంటుపడుతుందనే భయం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంతే కాదు బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఉంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, అక్కడి స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో పెట్టుబడిదారులు సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తారు. ఈ కారణంగా కూడా బంగారానికి ఒకసారిగా డిమాండ్ ఏర్పడి పసిడి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది.
0 Comments