సీతాఫల ఆకులు, సీతాఫలం గింజలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. గింజలను మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. సీతాఫలం గింజలలో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ సి, బి వన్, విటమిన్ ఈ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో జింక్ ఉంటుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆహారంలో సీతాఫలం గింజలను చేర్చుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సీతాఫలం గింజల్ని ఎండబెట్టుకొని వాటిని మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పొడిగా చేసుకుని మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. సీతాఫలం గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ గుండె జబ్బుల ప్రమాదాన్ని సీతాఫలం గింజలు తగ్గిస్తాయి. గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. సీతాఫలం గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది. ప్రేగుల కదలికలను సులభతరం చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. గింజల్లో ఉండే పోషకాలు మన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ గింజల్లో విటమిన్ సి మరియు వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీతాఫలం గింజల్లో ఉండే పోషకాల వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. సీతాఫలం గింజలు మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ కారణంగా కొద్దిపాటి ఆహారానికే మనకు సంతృప్తి కలుగుతుంది. ఇది మన శరీరంలో క్యాలరీలను తగ్గించడంలో దోహదం చేస్తాయి. సీతాఫలం గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇవి వాపును తగ్గించడానికి దోహదం చేస్తాయి. సీతాఫలం గింజల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండడం వల్ల ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గింజల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల జుట్టుకుదుళ్ళను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. సీతాఫలం గింజల్లో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చే సీతఫలం గింజలను పొడిగా చేసుకొని ఉపయోగించడం ఎంతో మంచిది.
0 Comments