ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ ఒకరు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లుగా గుర్తించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు. విమానం జైపూర్ నుంచి బయల్దేరినట్లుగా తెలిపారు. అలాగే సేఫ్‌గా ల్యాండ్ అయినట్లుగా ధృవీకరించారు. బాంబు బెదిరింపు రాగానే బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లుగా తెలిపారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం - అయోధ్య ధామ్ దగ్గర వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడ్డాయి. అనేక విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.
0 Comments