Ad Code

టికెట్ రిజర్వేషన్లను నాలుగు నెలల నుంచి రెండు నెలలకు కుదించిన ఇండియన్ రైల్వే !


టికెట్ రిజర్వేషన్లను 4 నెలల నుంచి 2 నెలలకు ఇండియన్ రైల్వే కుదించింది. ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. నిజానికి గతంలో రైల్వే అడ్వాన్స్ బుకింగ్ ప్రయాణానికి 60 రోజుల ముందు అవకాశం ఉండేది. దాన్ని 160 రోజులకు పెంచగా తాజాగా మళ్లీ పాత పద్ధతిలోకే మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తించనున్నాయి. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్ లో ఎలాంటి మార్పు లేదు. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశంలోనూ ఎలాంటి మార్పులు లేవని ఇండియన్ రైల్వే పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu