ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ సెలవుల్లో బాగా చదువుకోని విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని ట్యూషన్లు చెప్పి చదివించే ప్రయత్నం చేసింది. ఇందులో టీచర్ స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో ప్రచురిస్తానని టీచర్‌ను బెదిరించాడు. దీంతో టీచర్ విద్యార్థితో మాట్లాడకుండా తప్పించుకుంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి ఆ వీడియోను ఇతర స్నేహితులకు పంపించాడు. టీచర్ అసభ్యకర వీడియోను ముగ్గురు కలిసి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ టీచర్‌ను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడి ఆమెకు సాయం చేసింది. అనంతరం ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
0 Comments