రాజస్థాన్ రాష్ట్రంలోని కర్తార్‌పూర్ ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని ఉండగా, విద్యార్థులు ఆమెపై నిలబడి కాళ్లకు మసాజ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీచర్ పిల్లలతో మసాజ్ చేయించుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిల్లలతో మసాజ్ చేయించుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై పలువురు ఉపాధ్యాయులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజు చౌదరి స్పందించింది. ఈ వైరల్ అవుతున్న వీడియోను తాను కూడా చూసినట్లు తెలిపారు. టీచర్ అనారోగ్యంతో ఉండవచ్చని, తన పాదాలకు మసాజ్ చేయమని పిల్లలను అభ్యర్థించి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే విచారణ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు.
0 Comments