ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి తయారుచేసే లాంబోర్గిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో నిశాంత్ సబూ అనే ఓ వ్యాపారవేత్త తన లాంబోర్గిని కారులో రయ్‌రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇంతలో ఒకచోట ట్రాఫిక్ పోలీసులు అతని కారును ఆపారు. దీంతో అతను ఎందుకు ఆపారా అని ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కారు వద్దకు వచ్చిన ట్రాఫిక్ పోలీసు చెక్‌చేశాడు. అన్ని పత్రాలు ఉన్నాయని, చలాన్‌లు ఏమీ లేవని ధ్రువీకరించారు. అనంతరం నిశాంత్‌ను ఆ ట్రాఫిక్ పోలీసు ఓ కోరిక కోరాడు. లాంబోతో ఫొటోలు తీసుకునేందుకు అనుమతి కోరాడు. కార్లో కూర్చొని ఎంతో సరదాగా ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను నిశాంత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'పోలీసులు కూడా సూపర్ కార్ల పట్ల మక్కువ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం' అని వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
0 Comments