దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అందించాయి. దీంతో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు టెర్రరిస్టులు వ్యూహాలు రచిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, అన్ని మతపరమైన ప్రదేశాలు, గ్యారేజీలతో పాటు ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లతో సహా రద్దీ ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో పక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీపావళి సందర్భంగా రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్లు బస చేసే విదేశీ హోటళ్లను కూడా ఉగ్రవాదుల లక్ష్యం కావొచ్చు అని ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలు, సెక్యూరిటీ గార్డులను పోలీసులు కోరారు.
0 Comments