ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సూపర్ సిక్స్ లో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ తెలిపారు. దీని వలన ప్రభుత్వానికి ఏడాదికి ₹3,000 కోట్ల రూపాయలు అవుతుందంటూ తెలిపారు. వచ్చే క్యాబినెట్ లోనే ఈ పథకానికి సంబంధించి అనుమతిని కూడా తీసుకుంటామని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అటు డిప్యూటీ సీఎం ఇటు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారంటూ తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు కచ్చితంగా రేషన్ కార్డు అవసరమని, మొబైల్ లింక్, ఆధార్ కార్డ్ లింక్ ,గ్యాస్ బుక్ కి లింక్ అయ్యి ఉండాలి అంటూ తెలియజేశారు.
0 Comments