పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో అక్టోబర్ 11న అర్ధరాత్రి వేళ కొందరు బైకర్లు రేసింగ్ పోటీలు నిర్వహించారు. రోడ్డుపై అతి వేగంగా బైక్‌లు నడిపారు. కాగా, హుగ్లీలోని పోల్‌బార్ రాజ్‌ఘాట్ ఇంటర్‌సెక్షన్ వద్ద ఒక ఎస్‌యూవీ మలుపు తిరిగింది. ఒక బైకర్ ఆ వాహనం ముందు నుంచి దూసుకుపోయాడు. దాని వెనుక వేగంగా వచ్చిన మరో బైక్ ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి పెద్ద పేలుడు సంభవించడంతోపాటు మంటలు చెలరేగాయి. మరోవైపు ఆ బైక్‌ను నడిపిన వ్యక్తి, వెనుక కూర్చొన్న మరో వ్యక్తి మంటల్లో కాలిపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని పక్కకు లాగేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అనంతరం కాలిన గాయాలతో వారిద్దరూ మరణించారు. బొలెరో వాహనంలో ఉన్న వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments