Ad Code

80 వేలకు చేరువులో బంగారం ధర !


రిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర 80000 మార్కును తాకేందుకు సిద్ధమైంది. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,900 రూపాయలు పలికింది. అదే సమయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150 పలికింది. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందిగా మారింది. ఎవరైతే శుభకార్యాలు వివాహాది మహోత్సవాల సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు వారికి ఈ ధరలు భారంగా మారాయి. గత సంవత్సరం బంగారం ధర దాదాపు 65 వేల రూపాయల సమీపంలో ఉంది ఇప్పుడు 80 వేల రూపాయలకు చేరింది అంటే దాదాపు 15 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో ఆభరణాలు కొనుగోలు సైతం తగ్గింది. చాలామంది కస్టమర్లు బంగారం ధరలు తగ్గినప్పుడు కొందాము అని ధోరణి కనిపిస్తోంది. దాని ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 90 వేల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2730 డాలర్లకు చేరింది. దీంతో బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. అలాగే డాలర్ ధర పతనం కూడా బంగారం పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, వంటివి కూడా బంగారం ధర పెరగడానికి దోహదం చేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu