Ad Code

కమలాహారిస్‌కు బిల్‌గేట్స్‌ విరాళం 50 మిలియన్ల డాలర్లు !


మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ కార్యక్రమంలో కమలా హరీస్‌కు మద్దతుగా ఉన్న ఎన్జీవోకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారో బిల్ గేట్స్ బహిరంగంగా ప్రకటించలేదు. అయితే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనను ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు అందిన సమాచారం. బిల్ గేట్స్ కమలా హరీస్‌కు సంబంధించిన ఎన్జీవో  ఫ్యూచర్ ఫార్వర్డ్‌కి 50 మిలియన్ల డాలర్స్ అంటే దాదాపు రూ. 420 మిలియన్లు విరాళంగా ఇచ్చాడు. బిల్ గేట్స్ ఎన్నకల విషయంపై స్పందిస్తూ.. ఈ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి. “ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, పేదరికాన్ని తగ్గించడానికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను మార్చడానికి పనిచేస్తున్న వారికి నేను మద్దతు ఇస్తున్నాను. రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు చాలా ఏళ్లు ఉంది. కానీ, ఈ ఎన్నికలు పూర్తి భిన్నంగా ఉన్నాయి” అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇటీవల ఒక సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అధ్యక్ష రేసు నుండి వైదొలిగి, హారిస్ కు మద్దతును ఇచ్చారు. బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా హారిస్‌కు మద్దతుగా ఓటు వేశారు.

Post a Comment

0 Comments

Close Menu