Ad Code

మరో 5 భాషలకు శాస్త్రీయ హోదా!


మరో 5 భాషలకు శాస్త్రీయ హోదాని కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు కొత్తగా క్లాసికల్ హోదాను కల్పించాలని గురువారం నిర్ణయించారు. ఈ హోదాతో కలిగిన భాషల సంఖ్య ప్రస్తుతం 6 నుంచి 11కి పెరిగింది. ఇంతకు ముందు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు శాస్త్రీయ హోదా కల్పించారు. 2004లో తొలిసారిగా తమిళానికి, 2014లో ఒడియా భాషకు చివరిసారిగా క్లాసికల్ హోదా దక్కింది. ప్రస్తుతం శాస్త్రీయ హోదా దక్కిన భాషలకు ఎప్పటి నుంచో ఈ హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. 2014లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మఠారీ భాషపై భాషా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. మరాఠీని క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తించేందుకు అన్ని ప్రమాణాలు ఉన్నాయని చెబుతూ కమిటీ కేంద్రానికి రిపోర్టును కూడా పంపింది.

Post a Comment

0 Comments

Close Menu