అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరగడం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన తొలిసారి ప్రచారం నిమిత్తం బయటకు వచ్చారు. ''వేలాది మంది మద్దతుదారులతో కలిసి ఈవెంట్‌ను నిర్వహించడం గొప్ప అనుభవం. కానీ, కార్ రేసింగ్, బుల్‌రైడ్‌లో పాల్గొనడం ఎంత ప్రమాదకరమే, అదే విధంగా అధ్యక్ష రేసులోకి దిగడం కూడా అంతే ప్రమాదకరం. అధ్యక్షుడు అవుతారని అనుకున్నవారిపైనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి'' అని మించిగాన్‌లో ఏర్పాటు చేసిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ ఆడుతుండగా ఆయన సమీపంలో దుండగుడు భారీ రైఫిల్‌తో సంచరించడం సంచలనం సృష్టించింది. ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగిందంటూ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రకటించారు. అయితే.. ఈ ఘటనలో ట్రంప్‌కు ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
0 Comments