బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిస్సా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
0 Comments