త్రిపురలో సిద్ధేశ్వరి ఆలయ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడుతూ దేశ విభజనకు కాంగ్రెస్ కారణం. దేశాన్ని రెండుగా విభజించేలా ముస్లిం లీగ్‌కు మద్దతు హస్తం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు. 1905లో బెంగాల్‌ను విభజించేందుకు బ్రిటిషర్లు ప్రయత్నం చేయగా ప్రజల తిరుగుబాటుతో అది విఫలమైంది. అదే విధంగా ముస్లిం లీగ్ ప్రయత్నాలను వ్యతిరేకించి ఉంటే పాకిస్థాన్ ఏర్పాటు అయ్యేది కాదని యోగి పేర్కొన్నారు. సీఎం యోగి పాకిస్థాన్‌ను క్యాన్సర్‌తో పోలుస్తూ వినాశకర శక్తిగా పేర్కొన్నారు. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లోని పరిస్థితిపై యోగి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిపై చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీనికి బాధ్యులెవరో.. వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
0 Comments