రాజీవ్ గాంధీ లేకుంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయ్యేవారా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ కంప్యూటర్ ను ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాందీ కంప్యూటర్ ను పరిచయం చేయకుంటే చాయ్, ఇడ్లీ, వడ అమ్ముకుంటోనివి అని కేటీఆర్ నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొందరు తండ్రులను అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం గురించి బలుపు మాటలు మాట్లాడుతున్నారు. పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీదే అన్నారు. సోనియాగాంధీ పీ.వీ.నరసింహారావును ప్రధాని చేస్తే, రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
0 Comments