Ad Code

తగ్గిన బంగారం ధర - పెరిగిన వెండి ధర !


నేడు  ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.250 తగ్గి రూ.74,350లకు చేరుకుంది. బుధవారం తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.74,600 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర రూ.2000 పెరిగి రెండు వారాల గరిష్ట స్థాయి రూ.87 వేలకు చేరింది. గత మూడు సెషన్లలో కిలో వెండి ధర రూ.3,200 వృద్ధి చెందింది. పారిశ్రామిక అవసరాలకు గిరాకీ వల్లే వెండి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గురువారం కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 0.21 శాతం వృద్ధి చెంది 2,547.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత బంగారం ధర తిరిగి పెరుగుతోంది. ఇక ఔన్స్ వెండి ధర 29.16 డాలర్లు పలికింది. యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత ఫెడ్ రిజర్వ్ స్వల్పంగా వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య బంగారం ధరలు పుంజుకున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) నిర్ణయం కూడా బంగారం ధరలపై ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu