జమ్మూ కాశ్మీర్‌లో రెండవ దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం సెప్టెంబర్ 25వ తేదీన రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రెండవదశలో భాగంగా మొత్తం 26 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 239 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండవ విడతలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, అప్ని పార్టీ అధినేత అల్తాఫ్ బుఖారీలు పోటీలో ఉన్నారు. రెండవ విడత పోలింగ్ సెంట్రల్ కాశ్మీర్ జిల్లాలైన బుద్గాం, శ్రీనగర్, గండర్‌బాల్, జమ్మూ ప్రాంతంలో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 20 లక్షలకు పైగా ఓటర్లు బుధవారం పోలింగ్‌లో పాల్గొననున్నారు. తొలి దశలో 61.38శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
0 Comments