జమ్మూకాశ్మీర్ రేపు మొదటి విడుత ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడుతలో మొత్తం 24 నియోజకవర్గాలలో ఓటింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు స్వేచ్చగా వచ్చి ఓటు వేసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూకాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. అంతేకాకుండా ఆయా పార్టీలు మేనిఫెస్టోలు కూడా విడుదల చేశాయి. ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆయా పార్టీలు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి.
0 Comments