Ad Code

కాంగ్రెస్‌ దళిత వ్యతిరేక పార్టీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా


ర్యానా అసెంబ్లీ ఎన్నికల  ప్రచారంలో భాగంగా తోహనాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తూ దళిత నేతలైన కుమారి సెల్జా, అశోక్‌ తన్వార్‌ వంటి నేతలతో పాటు ప్రతి ఒక్కరినీ ఆ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంపై రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అమిత్‌ షా ఈ దేశంలో ఎస్సీలు, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరేనన్నారు. 'గత పదేళ్లుగా హర్యానా లోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేశాం. రాబోయే ఐదేళ్లకు మళ్లీ భాజపాను ఆశీర్వదించండి. కేంద్రంలో మోడీ సర్కార్‌ ఉంది, ఇక్కడ భాజపా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హర్యానాను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంది. గతంలో కాంగ్రెస్‌ పాలనలో హర్యానా రైతుల భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డారు'' అని అమిత్‌ షా ఆరోపించారు. కుమారి సెల్జా ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎంపీగా, సీడబ్ల్యూసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచగా అందుకు అధిష్ఠానం నిరాకరించింది. అలాగే, కొన్నేళ్ల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న అశోక్‌ తన్వార్‌ ఈ ఏడాది జనవరిలో భాజపాలో చేరిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu