గుజరాత్‌లోని వడోదర సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడి విశ్వమిత్రి నదీ ఉద్ధృతి పెరగడంతో అందులోని మొసళ్లు వరద నీళ్లలో ఇళ్లలోకి వస్తున్నాయి. మొసళ్లను అటవీ అధికారులు రక్షించి తీసుకెళ్తున్నారు. వడోదరలో సిబ్బంది సుమారు 40 మొసళ్లను రక్షించి తీసుకెళ్లారు. ఓ మొసలిని సిబ్బంది స్కూటరుపై తీసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో మొసలిని కాపాడిన సిబ్బంది స్కూటర్‌పై దాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు స్కూటర్‌ని నడపగా, మరో వ్యక్తి వెనకాల కూర్చుని మొసలిని పట్టుకున్నాడు. ఆ మొసలిని అటవీ శాఖకు అప్పగించేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. కాగా, వడోదర విశ్వమిత్రి నదీ తీరంలో ఉంటుంది. అందులో నుంచి వచ్చిన మొసళ్లను సిబ్బంది రక్షించి తీసుకెళ్లి మళ్లీ నదుల్లో వదులుతున్నారు.
0 Comments