Ad Code

కువైట్‌ యువరాజు, నేపాల్, పాలస్తీనా అధినేతలతో మోడీ భేటీ !


మెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఐరాస సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చిన నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌లతో ఆయన విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. పాలస్తీనా ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. 'భారత్‌-నేపాల్‌ స్నేహబంధం ఎంతో బలీయమైనది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేం దృష్టి సారించాం' అని మోడీ 'ఎక్స్‌' ద్వారా తెలిపారు. పరస్పర ఆసక్తిదాయక అంశాలపై, భాగస్వామ్య విస్తరణపై చర్చలు సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దేశంలో పర్యటించాలని ఓలి ఆహ్వానించగా మోడీ అంగీకరించారు. గాజాలో మానవతపరమైన సంక్షోభంపై అబ్బాస్‌ వద్ద మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. భారత్‌ సహకారం ఇకపైనా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కువైట్‌ యువరాజు షేక్‌ సబా ఖాలిద్‌ అల్‌ సబాతోనూ ఆయన భేటీ అయి, రెండు దేశాల మధ్య చారిత్రక అనుబంధాన్ని, ప్రజల మధ్య స్నేహపూరిత బంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. అంతకుముందు అమెరికా వ్యాపారవేత్తలు, సీఈవోల సదస్సులో మోడీ ప్రసంగించారు.

Post a Comment

0 Comments

Close Menu