Ad Code

రన్నింగ్ ట్రైన్ బయటకు వచ్చి రీల్స్ చేసిన యువతి !


రైలు పరుగులు పెడుతుండగా, ఆ అమ్మాయి రైలు నుంచి బయటకు వచ్చి, రైలు డోర్ హ్యాండిల్స్‌ భాగం పట్టుకుని వేలాడుతూ ఒక వీడియో చేయాలని ప్రయత్నించింది. ఈ సమయంలో రైలు పక్కన ఉన్న ఒక స్తంభానికి అమ్మాయి తల బలంగా గుద్దుకోవడంతో, ఆమె స్పృహ తప్పిపోయే స్థితికి చేరుకుంది. అది ఫేటల్ హిట్ లా కనిపించింది. ఆమె తలకు పోల్‌ చాలా బలంగా తగలానే ఒక బొమ్మలాగా తను బిగుసుకుపోయింది. అంత బలంగా గుద్దుకున్నా, ఆ అమ్మాయి ఏదోలా ట్రైన్ అలాగే పట్టుకుని ఉండగలిగింది. లేదంటే, ప్రాణం పోయి ఉండేది. ఈ వీడియో అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో తెలియదు. అంటే, ఆమె బతికిందా లేదా అనేది తెలియ రాలేదు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనలో ఎంత ప్రమాదం ఉందో ఈ వీడియో చూపిస్తోంది.  ఒక అద్భుతమైన ఫోటో తీయాలనే తపనలో, చాలా మంది యువత ప్రమాదాల గురించి ఆలోచించకుండా, ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు. ఇలాంటి లైఫ్-థ్రెటెనింగ్ స్టంట్స్ చేయడం వల్ల వారికి చాలా తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపన కంటే, సురక్షితంగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu