Ad Code

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విదేశీ పర్యటన !


తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం అమెరికా, జపాన్ దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతోపాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరింది. ఈనెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు పర్యటన కొనసాగనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్-పోతోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ఈనెల 24,25 తేదీల్లో అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరగనున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఈనెల 26న లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుంటారు. ఈనెల 27న ఎడ్ వార్డ్స్, సన్ బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు. ఈనెల 28వ తేదీన పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. ఈ నెల 29న టోక్యోకి చేరుకుంటారు. ఈనెల 30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా (వన్ టు వన్) సమావేశమవుతారు. యామాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసాకి, అక్టోబర్ 3న పానసోనిక్ ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తారు, అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు వెళ్లారు.

Post a Comment

0 Comments

Close Menu