Ad Code

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్య !


శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్యను అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే మంగళవారం నియమించారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్.పి.పి.)కి చెందిన హరిణి అమర సూర్య శ్రీలంక 16వ ప్రధానమంత్రి కాగా, మూడవ మహిళ. హరిణి మంచి విద్యావేత్త, హక్కుల కార్యకర్త, యూనివర్శిటీ లెక్చరర్, విద్య, సామాజిక న్యాయంలో ఆమె ఎంతో కృషి చేశారు. న్యూస్ వైర్ మీడియా నివేదిక ప్రకారం సిరిమావో బండారు నాయకే, చంద్రికా బండారనాయకే, కుమారతుంగ తర్వాత హరిణి అమరసూర్య శ్రీలంక్ మూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, సెప్టెంబర్ 21న జరిగిన ఎన్నికలలో మార్క్సిస్టు నాయకుడు అనురా కుమార దిసనాయకే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 'రాజకీయ నాయకులపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి నా వంతు కృషి చేస్తాను' అని మీడియాతో అన్నారు. 'శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యల సంక్లిష్టతను అర్థం చేసుకున్నానని, ప్రజల ఆశలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తానని, ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తానని, అందుకు మీ అందరి మద్దతు కావాలి' అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'నేను మాంత్రికుడిని, మంత్రగాడిని కాదు. నాకు తెలిసినవి వున్నాయి, తెలియనివీ వున్నాయి. అయితే నేను ఉత్తమమైన సలహాను కోరుతూ నా వంతు కృషి చేస్తాను. అందుకు మీ మద్దతు కావాలి' అని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu