Ad Code

నోయిడాలో ట్రావెల్ వ్లాగర్ !

                                              

ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆనంద్ మహీంద్రా షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే వాషింగ్ మెషీన్‌లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్‌. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్‌ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది. ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్‌రూమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు.

Post a Comment

0 Comments

Close Menu