కో-లొకేషన్ కేసులో సరైన ఆధారాలు లభించక పోవడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఉద్యోగులు చిత్రా రామకృష్ణ, రవి నరైన్ సహా ఏడుగురిపై ఆరోపణలను సెబీ కొట్టి పారేసింది. వారు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేనందున కేసును తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. చిత్రా రామకృష్ణతోపాటు రవి నరైన్ సహా ఏడుగురు ఎన్ఎస్ఈ మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు, రికార్డులు అందజేయడంలో విఫలమైనందున ఈ అభియోగాలను తోసిపుచ్చుతున్నట్లు సెబీ తన 83 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ఆనంద్ సుబ్రమణ్యన్, రవీంద్ర ఆప్టే, ఉమేష్ జైన్, మహేశ్ సోపార్కర్, దేవి ప్రసాద్ సింగ్ తదితరులపై ఆరోపణలనూ కొట్టేసినట్లు సెబీ తెలిపింది. ఎన్ఎస్ఈ సీఈఓగా పని చేసినప్పుడు చిత్రా రామకృష్ణ.. స్టాక్ బ్రోకర్లకు కో-లొకేషన్ కేసులో అక్రమంగా లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండున్నర దశాబ్దాల పాటు ఎన్ఎస్ఈలో సేవలందించిన చిత్రా రామకృష్ణ 2016 డిసెంబర్ లోనే వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినా.. బోర్డు సభ్యులతో విభేదాలే కారణం అని బయట పడింది. తర్వాత చిత్రా రామకృష్ణపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై సెబీ చర్యలు చేపట్టింది. ఆమె విదేశాలకు వెళ్లకుండా అప్పట్లో సీబీఐ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది.
0 Comments