మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ వాహనం సమాధాన్ చౌక్‌లోని సిటీ పోస్ట్ ఆవరణలో నిలిచి ఉంది. అక్కడి టాయిలెట్‌ను క్లీన్ చేసింది. అనంతరం వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. సెప్టిక్ ట్యాంకర్ కాస్త ముందుకు కదలగానే అక్కడి భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ వాహనంలో అందులో పడిపోయింది. వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద గోతిలో పడి చిక్కుకున్న ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు బైక్‌లు కూడా ఆ గుంతలో పడ్డాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అన్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
0 Comments