హైదరాబాద్ నగర పరిధిలో వ్యాపార సముదాయాల పని వేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నగర పోలీసులు మంగళవారం నాడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. దాబాలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, బేకరీలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్, కాఫీ, పాన్ షాప్స్‌ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. క్లాత్స్, జువెల్లరీ, సూపర్ మార్కెట్స్, కిరాణా తదితర షాప్స్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. అలాగే జీహెచ్‌ఎంసీ, దాని పరిధిలోని వైన్స్ దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. బార్లు వీక్ డేస్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, వీకెండ్స్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు నడపుకోవచ్చని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
0 Comments