Ad Code

సెప్టెంబర్‌ 16న తొలి వందే మెట్రో సర్వీసు ప్రారంభం !


దేశంలో తొలి వందే మెట్రో సర్వీసును సెప్టెంబర్‌ 16వ తేదీ సోమవారం ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- భుజ్‌ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని రెండ్రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన ఈ సేవలను ప్రారంభించనున్నారు. వందే మెట్రో అనేది పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే (అహ్మదాబాద్‌) పీఆర్‌ఓ ప్రదీప్‌ శర్మ తెలిపారు. అహ్మదాబాద్- భుజ్‌ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు ప్రారంభమై అహ్మదాబాద్‌ జంక్షన్‌కు 10.50 గంటలకు చేరుకుంటుందని శర్మ తెలిపారు. ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్‌ కొనుక్కుని రైలు ఎక్కొచ్చని పేర్కొన్నారు. వందే భారత్‌ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్‌ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కనీస టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించినట్లు తెలిసింది. మోడీ తన రెండ్రోజుల పర్యనటలో భాగంగా ఆదివారం గుజరాత్‌ చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌కు సమీపంలోని వద్సార్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అహ్మదాబాద్‌- గాంధీనగర్‌ మెట్రో రెండోదశ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే వందే మెట్రో సర్వీసులనూ ప్రారంభించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu