పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫొగట్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భాగంగా జరిగిన 16వ రౌండ్ పోటీల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. 3-2 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన యుయి సుసాకీని మట్టికరిపించింది. యుయి సుసాకీ అల్లాటప్పా రెజ్లర్ కాదు. వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో గతంలో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సైతం అందుకున్నారు. అలాంటి రెజ్లర్‌కు వినేష్ ఫొగట్ చుక్కలు చూపి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఎదుర్కొంటారు. 2016 రియో డి జనేరియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 10, 9 స్థానాలతోనే సరిపెట్టుకున్న వినేష్ ఫొగట్, ఈ సారి మాత్రం అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టగలిగింది.
0 Comments