లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. గువహటిలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి తాము ఎన్నికల సందర్భంగా మాట్లాడామని, త్వరలో దీనిపై చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నూతన నివాస విధానాన్ని తీసుకొస్తుందని, ఈ విధానం ప్రకారం అసోంలో జన్మించిన వారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అర్హత ఉంటుందని చెప్పారు. ఎన్నికల హామీల ప్రకారం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిలో స్ధానిక యువతకే అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల మధ్య భూ విక్రయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ తరహా లావాదేవీలను ప్రభుత్వం నిరోధించకపోయినా వీటిపై ముందుకెళ్లే ముందు సీఎం అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసిందని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
0 Comments