ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఫుల్ బిజీగా ఉండే సిటీ. ఇది ఢిల్లీ ఎన్ఆర్సీ లో కొంత భాగంగా ఉంటుంది. ఇక్కడి ఓ వ్యక్తి ఓ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ.. నడుస్తూ.. ఆగాడు. కొన్ని క్షణాలు అసౌకర్యంగా కనిపించాడు. ఆ పక్కనున్న వ్యక్తి అలాగే ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఆగిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. అది చూసిన పక్క వ్యక్తి అదిరిపడ్డాడు. ఏమైందో అని కంగారుగా చూశాడు. సీపీఆర్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు తెలిసింది. అతను కార్డియాక్ అరెస్టు తోనే చనిపోయాడని ప్రాథమికంగా అనుకుంటున్నా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాకే, పూర్తి వివరాలు తెలుస్తాయని డాక్టర్లు తెలిపారు. జిమ్‌లో ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని X యూజర్ సిరాజ్ నూరానీ.. ట్వీట్ చేశారు. "ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ బీమా ఏజెంట్ చనిపోయాడు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు" అని క్యాప్షన్ ఇచ్చారు.
0 Comments