Ad Code

కరోనాపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక !


ప్రపంచంలోని 84 దేశాల్లో కోవిడ్ తీవ్రమైన వైవిధ్యాలతో విస్తరించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. 84 దేశాల్లో పాటిజివ్ కేసులు అమాంతంగా పెరిగాయని, ఈసారి తీవ్రత మరో రూపంలో ఉండొచ్చని యూఎన్ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ జెనీవా మీడియాతో అన్నారు. ఐరోపాలో 20 శాతం కంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జూలైలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లో 40 మందికి పరీక్షించగా ఆందోళనకరమైన రిపోర్టులు వచ్చాయని తెలిపారు. అథ్లెట్లు కోవిడ్ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు. అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌ల్లో కొత్త ఇన్ఫెక్షన్‌లు నమోదైనట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu