తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ మేరకు వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వానలు కురిసే సమయంలో బయటకు వెళ్లకపోటమే ఉత్తమమని అధికారులు సూచించారు.
0 Comments