ఇరాన్ లోని టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు. ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ గురువారం ఇజ్రాయిల్‌కి వార్నింగ్ ఇచ్చింది. అంత్యక్రియలకు ముందు ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రార్థనలకు నేతృత్వం వహించారు. టెహ్రాన్ సిటీ సెంటర్‌లో, హనియే ఫోటో, పాలస్తీనా జెండాల పోస్టర్‌లను వేలాది మంది హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున హనియే హత్య జరిగింది. ఈ దాడిలో హనియేతో పాటు అతడి బాడీగార్డు కూడా మరణించాడు. అంతకుముందు ఇజ్రాయిల్ బీరూట్‌పై జరిపిన దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ని చంపింది.
0 Comments